Wednesday, April 24, 2024

భగ్గుమన్న జనాగ్రహం

అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణుల ధర్నాలు
నల్లచొక్కాలతో నిరసనలు
చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం
అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీ-డీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనా గ్రహ దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. అన్ని జిల్లాల్లోని నియోజక వర్గాల ప్రధాన కేంద్రాల్లో దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని నిషేధించాలంటూ ్ట 2ప ఓ్లబ…

ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అధికారం కోల్పోయిన కడుపు మంట ఒక వైపు, చిన్నవాడైనా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల అమలుతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారన్న అక్కసు మరోవైపు పెట్టుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిమీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ చిన్న సంఘటన జరిగినా దాని వెనుక వారే ఉంటూ ఆ నిందను ప్రభుత్వంపై మోపి అప్రదిష్టపాలు చేసేందుకు చంద్రబాబు అండ్‌ కో ఈ రెండున్నరేళ్ల కాలంలో చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరు హుందాగా ఉందన్నారు. ప్రభుత్వ వైఖరి నచ్చక ఆయన అసెంబ్లిస నుండి బాయ్‌కాట్‌ చేశారేతప్ప చంద్రబాబును ఏ సందర్భంలోనూ ఇలా బూతు మాటలు మాట్లడంగానీ, ప్రభుత్వ పథకాలపైన, జీవోలపైన ఏనాడూ కోర్టులకు వెళ్లిన దాఖలాలే లేవన్నారు. అంతెందుకు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కడుపు మంటతో కోర్టులకెళ్లి ఆపిన ఘటనను ప్రజలెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారంటూ నేతలు తమ ప్రసంగాలతో హోరెత్తించారు.
అన్ని జిల్లాల్లో ఆందోళనలు
ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరిగిన దీక్షకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక మిగిలిన జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు పాల్గొని పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని కల్పించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ మూడు రంగుల జెండాలు, తోరణాలు, ముఖ్యమంత్రి ఫెక్సీలతో కళకళలాడాయి. రెండో రోజు కూడా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు దీక్షలో రాజమండ్రి ఎంపీ మార్గాణి భరత్‌ పాల్గొన్నారు. దొంగ దీక్షలు చేస్తున్న చంద్రబాబు.. పట్టాభి మాటలకు ఆయన ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీ-డీపీ నేత బొజ్జల సుధీర్‌ రెడ్డిని నోరు అదుపులో పెట్టు-కోవాలని హెచ్చరించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో హిజ్రాలకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే వివరించారు. చంద్రబాబు, పట్టాభి, బొజ్జల సుధీర్‌ రెడ్డి చిత్రపటాలను కాలి కింద వేసి తొక్కి హిజ్రాలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బెషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్‌ చేశారు. కావలి హాస్పిటల్‌ సెంటర్‌ వద్ద దీక్షలో ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌ రెడ్డి, పట్టణాధ్యక్షుడు శివకుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే పద్మావతి, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపూరంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో దీక్ష కొనసాగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన దీక్షలో మంత్రి పేర్నినాని పాల్గొని పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. విశాఖ ఇసుకతోటలోమంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లా కడప అంబేద్కర్‌ కూడలి వద్ద వైఎస్సార్సీపీ నాయకులుచంద్రబాబుకు పోటీగా 36 గంటల జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కడప డిప్యూటీ- మేయర్‌ నిత్యానంద రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నగర మహిళా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, మహిళా కార్పొరేటర్లు,కో ఆప్షన్‌ మెంబర్లు, పూసల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్లిక తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో రెండోరోజు జనాగ్రహ దీక్షలో శివాలయం సెంటర్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి సూచన మేరకు.. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారు రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష కొనసాగింది. ఈ దీక్షలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గురివిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement