Thursday, April 25, 2024

కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన 88 ఏళ్ల ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ శ్రీధరన్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరనే తమ పార్టీ సీఎం అభ్యర్థి అని కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ వెల్లడించారు. శ్రీధరన్ కొచ్చి అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని సురేంద్రన్ తెలిపారు. కాగా శ్రీధరన్‌తో కేరళలో బీజేపీ పుంజుకుంటుందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement