Saturday, April 20, 2024

బిఆర్ ఎస్ లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం.. గిరిధ‌ర్ గ‌మాంగ్ కి పార్టీ బాధ్య‌త‌లు..!

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్నారు. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలొ గ‌మాంగ్ తో పాటు
ఆయన తనయుడు శిశిర్ గమాంగ్, ఒడిశా కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి సహా పెద్ద సంఖ్యలో నేతలు ఈరోజు బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు.ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలను గిరిధర్ గమాంగ్ కు కేసీఆర్ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఆసక్తిని చూపుతున్నారు. గిరిధర్ గమాంగ్ 9 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999 ఏప్రిల్ 17న జరిగిన అవిశ్వాస పరీక్షలో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్రను పోషించారు. అవిశ్వాస పరీక్ష చివరి నిమిషంలో పార్లమెంటుకు వచ్చి వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఆయన ఒడిశా సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది. అనంతరం, ఆయన కుమారుడు శిశిర్ బీజేపీలో చేరినప్పటికీ… ఆ పార్టీలో ఆయన యాక్టివ్ గా లేరు. ఈ నేపథ్యంలో వీరు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement