Friday, April 26, 2024

బాబు దీక్ష ఓ డ్రామా

గంజాయి కథ వారి సృష్టే
ఆధారాలివ్వకుండా ఆరోపణలా
తప్పు అంగీకరించకుండా బెదిరింపులా
గాంధేయవాదమని చెప్పి దీక్ష చేస్తూ తిట్లను ప్రోత్సహిస్తారా
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజం
అమరావతి, ఆంధ్రప్రభ: చంద్రబాబు చేసిన 36 గంటల దీక్ష ఒక ఫార్స్‌ అని, అర లీటరు నీటితో 36 గంటలు ఎలా ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రశ్నించారు. తాడేప ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డయాబెటిక్‌ ఉన్న చంద్రబాబు కేవలం అర లీటరు మంచి నీటితో ఎలా ఉండగలిగారన్నారు. డయాబెటిక్‌ ఉన్నవారు ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదమని ప్రజలందరికీ తెలిసిన విషయమేనని, అంటే చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకే దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. గాంధేయ వాదంతో దీక్ష చేశానని చెబుతున్న చంద్రబాబు ఆ దీక్షలో తిట్లను ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. తిట్లను ప్రోత్సహించేలా దీక్ష చేపట్టిన ఆయన గాంధేయవాదం అని ఎలా అంటారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం నేతలు బోసడీకే అంటే బాగున్నారా అనే అర్ధాన్ని వెతికి పట్టుకొచ్చారని, రేపు ఢిల్లిస పెద్దల దగ్గరకు వెళ్లినప్పుడు ఇదే పదంతో వారిని ఉచ్ఛరించి చొక్కా నలగకుండా బయటకు వస్తారా అంటూ ప్రశ్నించారు. శాంతిభధ్రతల గురించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎలా అడుగుతున్నారని నిలదీశారు. ఇక గంజాయి అంశంలో కూడా పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలోనే గంజాయిపై దాడులు అధికంగా చేయడం, పట్టుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) పేరుతో ఒక వింగ్‌ ఏర్పాటుచేసి అక్రమ గంజాయి, మద్యం వ్యాపారంపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ఈ సందర్భంగా గణాంకాలను ఆయన వివరించారు. ఇవన్నీ వివరిస్తూ కేంద్ర పెద్దలు చంద్రబాబు తప్పుడు ప్రోపకాండను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాపకాండలను వైకాపా గట్టిగా ప్రతిఘటిస్తుందని తెలిపారు.

జనాగ్రహ దీక్షలో సజ్జల
మనిషి అనే వాడికి ఎవరి-కై-నా కనీస సంస్కారం ఉండాలా.. వద్దా.. అనే ప్రశ్న అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఉత్పన్నమైందని, ఆ ప్రశ్నకు సమాధానం కావాల్సి ఉందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గుంటూరులో జరిగిన జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 40 ఏళ్ళ పాటు- రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పార్టీ.. ఒక మాట మాట్లాడినా, ఒక నిర్ణయం తీసు కున్నా ఒక విలువ ఉండాలన్నారు. చంద్రబాబు స్కిప్ట్రుతో, అధికార ప్రతినిధి చేత ప్రెస్‌ మీట్‌ పెట్టించి, వాళ్ళంతట వాళ్ళు వండిన గంజాయి కథను తెరమీదకు తీసుచ్చారన్నారు. ఫలానావాళ్ళు గంజాయి వ్యాపారం చేస్తున్నారని, నక్కా ఆనందబాబుతో మాట్లాడిస్తే.. ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని, ఆయనకు పోలీసులు నోటీ-సులు ఇస్తే.. దానికి ముఖ్య మంత్రి జగన్‌ను అనరాని మాటలన్నారని ఆగ్రహం వ్యక్తం చెశారు. బంద్‌ అంటూ ఒకరోజు, దీక్ష అంటూ రెండో రోజు నాటకాలడిన చంద్రబాబు ఎన్నో మాటలు మాట్లాడి పట్టాభి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి ఇంతవరకూ ప్రస్తావించడం లేదన్నారు. రాజ్యాంగపరంగా ఈ రాష్ట్రానికి హెడ్‌గా ఉన్న ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడించి కనీసం పొరపాటు- అని చెప్పకుండా, మనం అధికారంలోకి రాగానే.. అందర్నీ నరికేస్తాం.. కొట్టేస్తాం.. అని డాంబికాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పోకడలు చూస్తుంటే.. వారికి తక్షణం గొడవలు కావాలి అన్నట్లుగా ఉందన్నారు. అందర్నీ కొట్ట డం, ఢిల్లీకి వెళ్ళి ప్రదర్శన చేయడం, తద్వారా రాజకీయం చేయాలనుకోవడం ఎంతకాలం ఇలా చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సాధారణ ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయని, అధికారం కోల్పోయిన బాధతో రాష్ట్రపతి పాలన అడగటం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. మంచి కుటు-ంబ పెద్ద తన కుటు-ంబాన్ని ఎలా చూసుకుంటారో.. అలానే 50 ఏళ్ళు కూడా లేని నాయకుడు.. 70 ఏళ్ళ వ్యక్తిలా గొప్పగా వ్యవహరిస్తుంటే.. 70 ఏళ్ళ వ్యక్తి బాధ్యత లేని తుంటరి యువకుడిలా, ఒక తాగుబోతులా వ్యవహరిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా, జగన్‌ ఆ మాట చెప్పుకోవాల్సిన పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదకోశంలో ఇటు-వంటి పదాలను పెట్టు-కోవాలా.. లేక అలా మాట్లాడిన వారిని సాంఘిక బహిష్కరణ చేయాలా.. అన్నదానిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. బోషిడీకే అంటే బాగున్నారా.. అని మాట్లాడుతున్నారని, ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాను, ప్రధానిని అదే మాట అంటారా అంటూ ప్రశ్నించారు. ఒక బూతు మాట గురించి ఒక వ్యక్తి(చంద్రబాబు) ఉద్యమం నిర్మిస్తుంటే.. దానిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రజలంతా దీనిని ఆమోదిస్తారా.. లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు. ఆమోదించకపోతే ప్రజలంతా తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement