Friday, March 29, 2024

నారాయణ.. నారాయణ.. ఎంత మాట?

ఏపీ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు తాను స్వరూపానందేంద్ర స్వామిని యాదృచ్ఛికంగానే కలిశానని సీపీఐ నేత నారాయణ సెలవిచ్చారు. వ్యక్తిగతంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదంటూ క్లారిటీ ఇచ్చారు. దేవుడనే భావనకు తాము వ్యతిరేకం కాదన్నారు. మేము నాస్తికులం కాదని కేవలం మెటీరియాలిస్టులం అంటూ పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు. ఇక నిన్న నారాయణ స్వరూపనంద స్వామిని కలిసిన తరువాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement