Thursday, April 25, 2024

దేశంలో ఎన్ని? తెలంగాణలో ఎన్ని?

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 7,61,834 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16,838 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,73,761కు చేరింది. నిన్న 13,819 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 1,08,39,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 113 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,548కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,17,319 కరోనా కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. అటు ఇప్పటి వరకు 1,80,05,503 మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వివరించింది.

అటు తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,639కి పెరిగింది. గురువారం కరోనా నుంచి 149 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,963 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement