Monday, April 15, 2024

థియేట‌ర్ లోప‌ల బాణాసంచా కాల్చిన ఫ్యాన్స్ .. ఫైర్ అయిన స‌ల్మాన్ ఖాన్ ..

స్టార్ హీరోల చిత్రాలంటేనే హంగామా ఉంటుందని తెలుసు. థియేట‌ర్ బ‌య‌ట బాణా సంచా కాలుస్తార‌ని తెలుసు కానీ మ‌రీ థియేట‌ర్ లోప‌ల బాణాసంచా కాల్చేంత అని మాత్రం తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ అదే జ‌రిగింది..బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ చిత్రం అంతిమ్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఫ్యాన్స్ సంబ‌రాలు మామూలుగా లేవు..ఏకంగా వంద‌లాది మంది కూర్చొని ఉన్న థియేట‌ర్ లోప‌లే బాణాసంచా కాల్చారు.స‌ల్మాన్ న‌టించిన ‘అంతిమ్‌: ది ఫైనల్ ట్రూత్’ సినిమా ఇటీవ‌లే విడులైంది. ఈ సినిమాకు మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ పోలీసు అధికారిగా న‌టించాడు.

అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దాంతో స‌ల్మాన్ ఖాన్ వారిపై మండిప‌డ్డాడు. అభిమానుల‌తో పాటు థియేట‌ర్ యాజ‌మాన్యానికి ఓ విజ్ఞ‌ప్తి చేశాడు. థియేట‌ర్‌లో బాణ‌సంచా పేల్చే వారి ప్రాణాలే కాకుండా అందులో ఉండే ప్రేక్ష‌కుల ప్రాణాల‌కూ ముప్పు ఉంటుంద‌ని హెచ్చ‌రించాడు.థియేట‌ర్ల‌లోకి బాణ‌సంచా తీసుకురాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సెక్యూరిటీ సిబ్బందితో చెక్ చేయించాల‌ని ఆయ‌న సినిమా హాళ్ల య‌జ‌మానుల‌ను కోరాడు. ప్ర‌మాదాన్ని కొని తెచ్చుకునే ప‌నులు చేయ‌కుండా సినిమాను ఎంజాయ్ చేయాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement