Saturday, April 20, 2024

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

వచ్చే ఉగాది పర్వదినం నుంచి తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడారు. అయితే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కోవిడ్-19 టెస్టు చేయించుకుని నెగిటివ్ రిపోర్టు చూపిస్తేనే వారిని అనుమతిస్తామని స్పష్టం చేశారు.

తిరుమల వచ్చేవారంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ ఈవో సూచించారు. ఏప్రిల్ 15 తరువాత వయోవృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనాలను ప్రారంభించాలన్న యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. దాతలు సూచించిన వారి కుటుంబీకులు, మిత్రులకు దర్శనాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటు ఉచిత దర్శనం టోకెన్‌ల కోటాను దశలవారీగా రోజుకు 40వేలకు పెంచాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement