Wednesday, April 24, 2024

డెల్టా వేరియంట్ కేసులు పెరగవచ్చు WHO హెచ్చరిక..

కరోనా డెల్టా వేరియంట్ ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా లేదు..WHO విడుదల చేసిన తాజా వివరాల్లో ఈ విషయన్ని తేల్చిచెప్పింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి మున్ముందు మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది…డెల్టా వేరియంట్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన కొవిడ్‌ కేసుల వివరాలను వెల్లడించింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో  డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు పేర్కొంది. రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రబలే ప్రమాదం ఉందని తెలిపింది.

 ప్రపంచవ్యాప్తంగా గత వారం11 వరకు 30 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోల్చితే పది శాతం ఎక్కువ. గత తొమ్మిది వారాలుగా మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ముందు వారంతో పోల్చితే 55 వేల మరణాలతో 3 శాతం పెరిగింది. అలాగే కొవిడ్‌ కేసుల సంఖ్య కూడా 3.7 లక్షల నుంచి 4 లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 18.6 కోట్లు కాగా, మరణాల సంఖ్య 40 లక్షలు దాటింది. ఈ వారం అమెరికా మినహా అన్ని దేశాల్లో కేసులు పెరిగాయి. 178 దేశాల్లో ఆల్ఫా వేరియంట్‌, 123 దేశాల్లో బీటా వేరియంట్‌, 75 దేశాల్లో గామా వేరియంట్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. తాజా గణాంకాల ప్రకారం ఇతర వాటికంటే  డెల్టా వేరియంట్‌ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగవ వంతు(24.7 శాతం) మంది కనీసం ఒక డోసైనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఒకేసారి నాలుగు డివైజ్ లలో వాట్సప్ వాడుకోవచ్చట..

Advertisement

తాజా వార్తలు

Advertisement