Wednesday, April 17, 2024

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్: లాక్‌డౌన్ పై నాలుగు వారాలు వెనక్కి తగ్గిన యూకే

కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్ లాక్‌డౌన్ ఎత్తివేతను నాలుగు వారాలు ఆలస్యం చేసింది. నిజానికి ఈ నెల 21తో యూకేలో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో ఆంక్షలు ఎత్తివేయాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పుడు డెల్టా వేరియంట్ రూపంలో వచ్చిన కొత్త సమస్య లాక్‌డౌన్‌ను మరో నెల రోజులపాటు పొడిగించేలా చేసింది. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న ప్రభుత్వం.. మరో నాలుగు వారాలపాటు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో డెల్టా వేరియంట్ కేసులు 30 వేలు పెరిగి 42,323కు చేరుకున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8,125 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement