Wednesday, April 24, 2024

టూరిస్ట్ ల‌పై ఏనుగు దాడి .. త‌ర్వాతేం జ‌రిగిందంటే ..

వ‌న్య‌ప్రాణుల‌ని చూడాల‌నే స‌ర‌దా అంద‌రికీ ఉంటుంది కానీ.. అవి తిర‌గ‌బ‌డ్డాయో ప్రాణాలు గాల్లో క‌లిసిపోవ‌డం ఖాయం.. మూగ‌జీవాలు సాధార‌ణంగా ఎవ‌రి జోలికి రావు..వాటికి తిక్క‌రేగితే ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌న్న సంగ‌తి ఇక్క‌డ నిరూపించిందో ఏనుగు..వివ‌రాలు చూస్తే .. విదేశీ టూరిస్టులు ఆఫ్రికా స‌ఫారీకి వెళ్లేందుకు ఆస‌క్తిగా ఉంటారు. ఎందుకంటే ఆఫ్రికా స‌ఫారీ చాలా థ్రిల్లింగా ఉంటుంది.. వన్యమృగాలను దగ్గరగా చూడటమే కాదు… అక్కడ తీసే ఫొటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కొన్ని చెట్లు పచ్చగా… గడ్డి పసుపు రంగులో… దూరంగా ఎర్రటి సూరీడు… మధ్యలో ఆహారం తినే జంతువులు… ఇలా ఫొటోగ్రఫీ చాలా బాగా వస్తుంది. అందుకే టూరిస్టులు రెక్కలు కట్టుకొని సఫారీలో వాలిపోతారు.

కాగా రీసెంట్ గా ప‌లువురు టూరిస్టులు… ఓపెన్ టాప్ జీపులో సఫారీకి వెళ్లారు. జీపు డ్రైవర్… ఏనుగులకు దగ్గరగా జీపును ఆపారు. జీపు నుంచి కిందకు దిగకుండా వాటిని చూసి ఉంటే… అవి టూరిస్టుల జోలికి వచ్చేవి కావు. కానీ ఆ టూరిస్టులు డ్రైవర్ మాట వినలేదు. కొందరు ఏనుగుల దగ్గరకు వెళ్లారు. దాంతో ఓ పెద్ద ఏనుగు… తమకు ఆపద కలగబోతోందని భావించి… రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. జీపు దగ్గరకు వచ్చి… ఇష్టమొచ్చినట్లు కుదిపేసింది. ఆ సమయంలో ఓ టూరిస్టు… ఏనుగును వీడియో తీస్తున్నారు. ఏనుగు కుదిపేయడంతో… వీడియో కూడా గందరగోళం అయ్యింది. జీపుపై దాడి చేసిన ఏనుగు… కాసేపటికి నెమ్మదించింది. దాంతో… టూరిస్టులు బ‌తుకు జీవుడా అంటూ ప్రాణాల‌ను ర‌క్షించుకున్నారు. ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అది మితి మీర‌కూడ‌ద‌ని ఆ టూరిస్టుల‌కి అర్థ‌మ‌య్యే ఉంటుంది..ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement