Monday, April 15, 2024

కెటిఆర్ స‌రికొత్త ఉద్య‌మం – రండి మ‌న విద్యార్హ‌త‌లు బ‌య‌ట‌పెడ‌దాం…

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హత విషయంలో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఉన్నత విద్యను అభ్యసించారనడానికి ఎలాంటి ఆధారాలను కూడా ఎవరికీ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఓ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తన విద్యార్హతలను బయటపెట్టారు. పుణే యూనివర్శిటీలో కేటీఆర్ చదువుకున్నారు. అక్కడ బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సర్టిఫికెట్లను బహిరంగంగా షేర్ చేయమంటారా? అనే ప్రశ్నను సంధించారు. మోడీ విద్యార్హతలను ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ హైకోర్టు భారీగా జరిమానా విధించిన వేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. తమ తమ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడిస్తూ పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement