Friday, April 26, 2024

ఈనెల 20న భీమ్లా నాయక్ నుంచి రానా టీజర్

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్ . సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ పాత్ర లుక్‌, ఫస్ట్ గ్లింప్స్ లను విడుదల చేయగా, వాటికి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభించింది.

మరోవైపు ఇన్నాళ్లపాటు రానా నటిస్తున్న పాత్రకి తక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి. అయితే అదంతా ఓ ప్లానింగ్‌ ప్రకారం చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రానా నటిస్తున్న డానియెల్‌ శేఖర్‌ పాత్ర లుక్‌లు విడుదల చేయబోతున్నారు. బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్‌ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 20న రానా నటిస్తున్న డానియెల్‌ శేఖర్‌ పాత్ర గ్లింప్స్ ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక రానా టైమ్‌ స్టార్ట్ కాబోతుందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement