Thursday, April 25, 2024

ఇక సమరమే: న్యూజిలాండ్ 15 మంది కూడా రెడీ

జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. కొన్నాళ్లుగా అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి టెస్టు సిరీస్ గెలిచింది.

ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన ఈ టీమ్‌లోకి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు నుంచి దూరమైన సభ్యులకు తిరిగి చోటు కల్పించింది కివీస్ క్రికెట్ టీమ్. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. కొన్నాళ్లుగా అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి టెస్టు సిరీస్ గెలిచింది. తొలి టెస్టులోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ డివాన్ కాన్వేకి కూడా ఫైనల్ జట్టులో చోటు కల్పించిన న్యూజిలాండ్ టీమ్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, జాకోబ్ డఫీ, డార్ల్ మిచెల్, డాగ్ బ్రాస్‌వెల్ వంటి ఐదుగురు ప్లేయర్లను జట్టు నుంచి తప్పించింది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే: కేన్ విలియంసన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), బీజే వాట్లింగ్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, డివాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కేల్ జెమ్మీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆజజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement