Sunday, December 8, 2024

పార్లమెంట్‌లో ఈ ఎంపీ ధరించిన మాస్క్ చూశారా?

తెలంగాణలోని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభివృద్ధి చేసిన మాస్క్ పార్లమెంట్‌లో సోమవారం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ మాస్క్‌కు భిన్నంగా ఉన్న ఈ హైఎఫిషియన్సీ మాస్క్‌ను ధరించి రాజ్యసభ ఎంపీ నరేంద్ర జాదవ్ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. దానిని చూసిన ఇతర సభ్యులు ఆశ్చర్యపోయారు. స్వతహాగా ఇంజినీర్ అయిన విశ్వేశ్వరరెడ్డి కరోనా సమయంలో పలు రకాల మాస్కులు,శానిటైజర్లు, వెంటిలేటర్లు రూపొందించారు. అందులో ఒకటే ఇది. నరేంద్ర జాదవ్ ధరించిన మాస్క్‌ను చూసిన ఇతర సభ్యులు దాని గురించి ఆరా తీశారు. ఇది 99.07 శాతం శుద్ధమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని, దీనిని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రూపొందించారని ఆయన వారికి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement