Wednesday, April 14, 2021

నిరుద్యోగులకు శుభవార్త.. 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఉద్యోగాల ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, LDC, కార్పెంటర్, హిందీ టైపిస్టు లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. indianairforce.nic.in ద్వారా మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు: పోస్టును బట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు. వయసు: 18 నుంచి 25 ఏళ్లు.

1,524 ఉద్యోగాల ఖాళీల వివరాలు:

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ యూనిట్: 362 పోస్టులు
సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్: 28 పోస్టులు
ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ యూనిట్: 132 పోస్టులు
సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్: 116 పోస్టులు
మెయింటెన్స్ ఎయిర్ కమాండ్ యూనిట్: 479 పోస్టులు
ట్రైనింగ్ కమాండ్ యూనిట్: 407 పోస్టులు

Advertisement

తాజా వార్తలు

Prabha News