Sunday, May 9, 2021

ఈటెల భూ కబ్జా చేసినట్లు కలెక్టర్‌కు అధికారుల నివేదిక

మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. మెదక్ జిల్లా హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్లు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈటెలకు చెందిన జమున హేచరీస్ ఆధ్వర్యంలో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్.. ఈటెల మంత్రిత్వ శాఖను తీసుకున్నారు. ప్రస్తుతం ఈటెల శాఖ లేని మంత్రిగా కొనసాగుతున్నారు.

ఈటెల భూ కబ్జా చేసినట్లు కలెక్టర్‌కు అధికారుల నివేదిక
Advertisement

తాజా వార్తలు

Prabha News