Sunday, December 1, 2024

U-19 Boxing | 17 మెడల్స్‌తో సత్తా చాటిన యువ బాక్సర్లు

కొలొరాడో (అమెరికా): అమెరికా వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. ఏకంగా 17 మెడల్స్‌ కైవసం చేసుకుని సత్తా చాటుకున్నారు. అందులో 4 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

మహిళల జట్టు మొత్తం 10 మెడల్స్‌ గెలుచుకుని రెండో స్థానంలో నిలవగా.. పురుషుల జట్టు 7 పతకాలతో టోర్నీని ముగించింది. మహిళల విభాగంలో క్రిష వర్మ (75 కేజీలు), పార్థవి గ్రెవల్‌ (65 కేజీలు), వంశిక గోస్వామి (80 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకోగా.. పురుషుల విభాగంలో హేమంత్‌ సాంగ్వాన్‌ (90 కేజీలు) పసిడిని ముద్దాడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement