Wednesday, March 27, 2024

WTC పాయింట్లు..ఇప్పుడు మరింత సులభతరం..

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ రెండో సీజన్ కి ఐసీసీ కొత్త పాయింట్ల విధానాన్ని ప్రకటించింది. తొలి WTC ఫాలో అయిన పాయింట్ల ప‌ద్ధ‌తిని ఐసీసీ ఇప్పుడు సుల‌భ‌త‌రం చేసింది. తాము అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఓ టీమ్ డ‌బ్ల్యూటీసీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల‌ను కౌంట్ చేసేలా ఈ కొత్త ప‌ద్ధ‌తిని క్రికెట్ క‌మిటీ తీసుకొచ్చిన‌ట్లు ఐసీసీ తెలిపింది. క‌రోనా కార‌ణంగా తొలి డ‌బ్ల్యూటీసీలో కొన్ని సిరీస్‌లు కాక‌పోవ‌డంతో అందుబాటులో ఉన్న పాయింట్ల ప‌ర్సెంటేజ్ ఆధారంగా టీమ్స్‌కు ర్యాంకులు కేటాయించారు. డ‌బ్ల్యూటీసీలో భాగంగా మార్చి 31, 2023లోపు 9 జ‌ట్లు ఆరేసి సిరీస్‌లు (ఇంట మూడు, బ‌య‌ట మూడు) ఆడ‌తాయి.

ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి మ్యాచ్‌కు 12 పాయింట్లు అందుబాటులో ఉంటాయి. గెలిచిన టీమ్‌కు ఈ మొత్తం పాయింట్లు వస్తాయి. ప‌ర్సెంటేజ్ పాయింట్ల రూపంలో చెప్పాలంటే 100. అదే మ్యాచ్ టై అయితే ఒక్కో టీమ్‌కు 50 ప‌ర్సెంటేజ్ పాయింట్లు (ఆరు పాయింట్లు), మ్యాచ్ డ్రా అయితే 4 పాయింట్లు (33.33 ప‌ర్సెంటేజ్ పాయింట్స్‌) వ‌స్తాయి. మ్యాచ్‌ల సంఖ్య‌ను బట్టి సిరీస్ పాయింట్లు ఆధార‌ప‌డి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement