Thursday, April 25, 2024

ఏప్రిల్‌ 25నుంచి ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌

ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌కు సంబంధించిన గ్రూపులను గురువారం ప్రకటించారు. ఇందుకోసం న్యూఢిల్లిలోని ఫుట్‌బాల్‌ హౌస్‌లో డ్రా తీశారు. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ షాజీ ప్రభాకరన్‌ తదితరులు ఈ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకరన్‌ మాట్లాడుతూ హీరో ఐడబ్ల్యూఎల్‌ సీజన్‌ మరింత పోటీతత్వంతో కూడిన లీగ్‌కు అర్హత లాంటిదని, తదుపరి ప్రచారంలో ఇది అమలులోకి రానుందని, ఇందులో పాల్గొంటున్న 16 జట్లకు శుభాకాంక్షలు అని తెలిపారు.

హీరో ఐడబ్ల్యుఎల్‌ భారత మహిళల ఫుట్‌బాల్‌ అభివృద్ధికి దోహదం చేస్తుంది అని చెప్పారు. ఏప్రిల్‌ 25నుంచి ఐడబ్య్లుఎల్‌ లీగ్‌ మొదలవుతుంది. 2022-23 సీజన్‌కు 16 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌తో కూడిన నాకౌట్‌ దశకు ప్రతి గ్రూప్‌ నుండి మొదటి నాలుగు జట్లు అర్హత సాధిస్తాయి.

గ్రూప్‌ ఎ: గోకులం కేరళ, మాతా రుక్మణి, హోప్స్‌, మిసాకా యునైటెడ్‌ , కహానీ, ఈస్ట్‌ బెంగాల్‌, స్పోర్ట్స్‌ ఒడిశా, ముంబై నైట్స్‌.

గ్రూప్‌ బి: సేతు, కిక్‌స్టార్ట్‌, సెల్టిక్‌ క్వీన్స్‌, ఈస్టర్న్‌ స్పోర్టింగ్‌ యూనియన్‌, సిఆర్‌పిఎఫ్‌, చర్చిల్‌ బ్రదర్స్‌ ఎఫ్‌సిజి, లార్డ్‌ ్స ఎఫ్‌ఎ కొచ్చి, ఒడిశా ఎఫ్‌సి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement