Saturday, April 20, 2024

వీడియో..జారవిడిచిన క్యాచ్ పట్టిన ఫాబియన్‌ అలెన్‌..

విండీస్ ఆటగాడు‌ ఫాబియన్‌ అలెన్‌ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌తో అలరించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో హెడెన్‌ వాల్స్‌ వేసిన ఐదో బంతిని కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌ అని అంతా భావిస్తున్న తరుణంలో లాంగాన్‌.. అటు మిడ్‌ వికెట్‌ నుంచి బ్రేవో, అలెన్‌లు పరిగెత్తుకొచ్చారు. అయితే బ్రేవో అప్పటికే బంతిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయగా అతని చేతుల నుంచి జారింది. ఇంతలో సమయస్పూర్తితో వ్యవహరించిన అలెన్‌ బంతికి కాస్త దూరంలో ఉన్నా తన కాళ్లను స్ట్రెచ్‌ చేస్తూ అందుకున్నాడు. అంతే ఫామ్‌లో ఉన్న ఫించ్‌ పెవిలియన్‌కు చేరగా.. విండీస్‌ క్రికెటర్లు సంబరాల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement