Saturday, April 20, 2024

IPL | దంచికొడుతున్న ధ‌వ‌న్ సేన‌.. రాజ‌స్థాన్‌పై ప‌ట్టుసాధించేనా?

ఐపీఎల్‌ లో ఇవ్వాల (బుధ‌వారం) రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య అస్సాంలోని గువ‌హ‌టిలో మ్యాచ్‌ జరుగుతోంది. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మాంచి ఊపు మీదున్నాయి. ఏప్రిల్‌ 1న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 7 పరుగుల తేడాతో గెలిచింది. ఇక‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా ఏప్రిల్‌ 2న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

కాగా, ఇవ్వాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ దూకుడుమీద ఆడుతోంది. 5 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగులు దాటేసి జోష్ పెంచింది. ప్ర‌భుసిమ్రాన్ సింగ్ 43, శిఖ‌ర్ ధావ‌న్ 13 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement