Wednesday, May 25, 2022

వెల్‌డన్‌ ముసలోడా.. బ్రావోను టీజ్‌ చేసిన ధోనీ

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారంరాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే సీనియర్‌ మెంబర్‌ డ్వేన్‌ బ్రావోను సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ టీజ్‌ చేసిన విధానం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఢిల్లి బ్యాటింగ్‌ చేస్తున్న 17వ ఓవర్‌లో.. పేసర్‌ నోర్ట్‌జీ క్రీజులో ఉన్నాడు. తీక్షణ వేసిన బంతిని నోర్ట్‌జీ బలంగా కొట్టాడు. దాన్ని కవర్స్‌లో ఉన్న బ్రావో డైవ్‌ చేసిన మరీ అడ్డుకున్నాడు.

అది చూసిన ధోనీ.. ”వెల్‌ డన్‌ ముసలోడా (ఓల్డ్‌ మ్యాన్‌)” అంటూ టీజ్‌ చేశాడు. ఇది స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ధోనీ మాటలు విన్న వాళ్లందరూ నవ్వుకున్నారు. ధోనీ, బ్రావో ఇద్దరూ 2011 నుంచి చెన్నై జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. అందుకే ఇలా అనగలిగాడని అభిమానులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement