Sunday, April 14, 2024

వాల్ వచ్చేశాడు… టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ నియామకం!

టీమిండియా హెడ్ కోచ్ గా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది.

ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ద్ర‌విడ్ స్పందిస్తూ… రవిశాస్త్రి కోచ్ గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని కితాబునిచ్చారు. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement