Friday, November 8, 2024

లార్డ్స్ టెస్ట్: నిరాశతో టవల్‌ విసిరేసిన కోహ్లీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఇద్దరు ఔటైన సమయంలో క్రీజులో ఉన్న కోహ్లీ.. 4 ఫోర్లు కొట్టి మంచి ఊపుమీదున్నాడు. అయితే అంతలోనే తన బలహీనతను మరోసారి బయట పెట్టాడు. ఆఫ్ స్టంప్ కి అవతల వేసిన బంతిని వెంటాడి మరి వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇటీవల కాలంలో కోహ్లీ టెస్టుల్లో ఫేలవ ప్రదర్శనతో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కోహ్లీ వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కోహ్లీ స్కోర్లు వరుసగా 0, 62, 27, 0, 44,13, 0, 42, 20 గా ఉన్నాయి. కెప్టెన్ గా జట్టును ముందుండి నడింపించాల్సిన కోహ్లీ త్వరగా ఔట్ అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కోహ్లీ కూడా తన ఆట పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. లార్డ్స్ టెస్టు 4వ రోజు విరాట్ కోహ్లీ 20 పరుగులకే వెనుదిరిగిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి అసహనంతో కనిపించాడు. తీవ్ర నిరాశను ప్రదర్శిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్‌ను విసిరినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంత మంది నెటిజన్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘కోహ్లీ! ఎంత సమయమైన తీసుకో.. కానీ మళ్లీ నీ ప్రతాపం చూడాలి. నీ ఆటతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించాలి. దాని కోసం నేను వేచి ఉంటాను.’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరో వైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇది కూడా చదవండి: జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్ పై సెక్రటరీ దాడి..

Advertisement

తాజా వార్తలు

Advertisement