Tuesday, April 23, 2024

తొలి వన్డే విజయం అద్భుతం: కోహ్లీ

ఇంగ్లండ్ తో తొలి వన్డే లో విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో త‌మ‌కు ద‌క్కిన‌ గొప్ప విజయం ఇదేన‌ని చెప్పాడు. మ‌రే విజ‌య‌మూ దీనికి సాటి రాద‌ని వ్యాఖ్యానించాడు. ఈ వ‌న్డేలో భారీ  విజయం సాధించ‌డం ప‌ట్ల తాను గ‌ర్విస్తున్న‌ట్లు చెప్పాడు. ఇంగ్లండ్‌పై గెలిచి ఇటీవ‌లే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న టీమిండియా తాజాగా జ‌రిగిన తొలి వ‌న్డేలోనూ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంపై టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. తాము తిరిగి పుంజుకోవడం అద్భుతమేన‌ని అన్నాడు. మొదట్లో భారీగా పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు తిరిగి పట్టుదలగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధి అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు కింగ్ కోహ్లీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement