Friday, April 26, 2024

అండర్‌-19 ప్రపంచకప్‌.. ఉగాండాపై యువ భారత్‌ భారీ విజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ ఉగాండాపై 326పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకున్న భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నిర్ణీత 50ఓవర్లలో 5వికెట్లుకు 405పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్‌ రఘువంశీ 120బంతుల్లో 22ఫోర్లు, 4సిక్స్‌లతో 144పరుగులు చేసి సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రాజ్‌ 108 బంతుల్లో 14ఫోర్లు, 8సిక్స్‌లతో 162పరుగులు చేసి భారీశతకంతో అజేయంగా నిలిచాడు.

ఈక్రమంలో రాజ్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచి ధావన్‌ స్కాట్లాండ్‌పై 2004లో ఢాకాలో 155పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు. రాజ్‌, రఘువంశీ మూడో వికెట్‌కు 206పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 406పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా 19.4ఓవర్లలో 79పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో యువ భారత్‌ 326పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. రాజ్‌ బవా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement