Thursday, May 26, 2022

అండర్‌-19 ఆసియాకప్‌.. అఫ్గాన్‌పై గెలిచిన భారత్‌..

అండర్‌-19 ఆసియాకప్‌ 2021లో భాగంగా నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు అఫ్గాన్‌పై 4వికెట్లు తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌చేసిన అఫ్గానిస్థాన్‌ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 259పరుగులు చేసింది. కెప్టెన్‌ సఫీ 73పరుగులుతో అర్ధశతకం సాధించగా, ఇజాజ్‌ అహ్మద్‌ 68బంతుల్లో ఒక ఫోరు, 7సిక్సర్లతో 86పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం 260పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువజట్టు 48.2 ఓవర్లలో 6వికెట్లుకు 262పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ హర్నూర్‌ 74బంతుల్లో 9ఫోర్లుతో 65పరుగులుచేసి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 29బంతుల్లో 4ఫోర్లుతో 35పరుగులు చేసిన కౌశల్‌ నాటౌట్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement