Thursday, November 28, 2024

Breaking | సెంచ‌రీతో చెల‌రేగిన తిల‌క్‌.. స‌ఫారీల ముందు భారీ టార్గెట్‌

ఆంధ్రప్రభ, స్పోర్ట్స్​ డెస్క్​: భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా బుధ‌వారం రాత్రి జ‌రిగుతున్న‌ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు కెప్టెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, తొలి ఒవ‌ర్లో రెండో బంతికే సంజూ శాంస‌న్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్ చేరాడు.. ఇక‌.. క్రీజ్‌లోకి వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ సిక్సులు, ఫోర్ల‌తో చెల‌రేగి పోయాడు.

- Advertisement -

56 బంతుల్లో 107 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక‌. తిల‌క్‌కు తోడు ఓపెన‌ర్‌గా దిగిన అభిషేక్ శ‌ర్మ కూడా అర్థ సెంచ‌రీ పూర్తి చేసుకుని రాంగ్ బాల్ కోసం ముందుకొచ్చి స్టంప్ అవుట‌య్యాడు. ఆ త‌ర్వాత సూర్య‌, పాండ్యా, రింకూ త‌క్కువ స్కోరుకే అవుట‌య్యారు. కాగా, చివ‌ర్లో వ‌చ్చిన ర‌మ‌ణ్‌దీప్ సింగ్ 6 బంతుల్లో 15 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు. ఇట్లా నీర్ణీత 20 ఓవ‌ర్ల‌లో టీమిండియా 219 ప‌రుగులుచేసింది.. ఆరు వికెట్ల‌ను కోల్పోయింది.. కాగా, ఆతిథ్య సౌతాఫ్రికా జ‌ట్టు ముందు 220 ప‌రుగుల టార్గెట్ ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement