Thursday, April 25, 2024

Breaking: గట్టి టార్గెట్​ పెట్టిన సన్​రైజర్స్.. పోరాడుతున్న గుజరాత్​ టైటాన్స్​ 140/4

టాటా ఐపీఎల్​ 2022లో భాగంగా ఇవ్వాల సన్​రైజర్స్​ హైదరాబాద్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ జట్టు పటిష్టమైన స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కాగా, గుజరాత్​కు 196 పరుగుల టార్గెట్​ పెట్టింది. అయితే.. 16 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్​ టైటాన్స్​ జట్టు 140 పరుగులు చేసింది. ఇంకా నాలుగు ఓవర్లలో 56 పురగులు చేయాల్సి ఉంది.. ప్రస్తుతం అభినవ్​ మనోహర్​, రాహుల్​ తివాతియా క్రీజ్​లో ఉన్నారు.

గుజరాత్​ స్కోర్​: 16 ఓవర్లలో 140/4.. ఇంకా 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది..

అయితే.. సన్‌రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ 69 పరుగులు తొలి వికెట్, 85 పరుగుల వద్ద రెండో వికెట్​ కోల్పోయింది. యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో సన్‌రైజర్స్ కు తొలి బ్రేక్ దక్కింది. అంతకుముందు వరకు సాహా, గిల్ (22) స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా సాహా అదరగొట్టాడు ఉమ్రాన్ బంతి అందుకున్న తొలి ఓవర్లోనే గిల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఉమ్రాన్వేసిన బంతిని కవర్స్ వైపు ఆడేందుకు గిల్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాట్‌ను తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. దాంతో 69 పరుగుల వద్ద గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.

అదరగొట్టిన సన్‌రైజర్స్.. గుజరాత్‌ ముందు భారీ టార్గెట్

గుజరాత్ టైటన్స్ పై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. అభిషేక్ శర్మ (65), ఎయిడెన్ మార్క్రమ్ (56) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. వీళ్లకుతోడు చివరి ఓవర్లు శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ దెబ్బకు ఏకంగా 25 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హైదరాబాద్ వద్ద ఉన్న బౌలింగ్ బలానికి ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ను మహమ్మద్ షమీ (3/39) గట్టి దెబ్బ కొట్టాడు.

- Advertisement -

కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5), రాహుల్ త్రిపాఠీ (16), నికోలస్ పూరన్ (3) వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ (3) రనౌట్ అయ్యాడు. అయితే చివర్లో శశాంక్ సింగ్‌తోపాటు మార్కో జాన్సెన్ (8 నాటౌట్) కూడా ఒక సిక్సర్ బాదాడు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లతో చెలరేగగా.. యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement