Thursday, November 28, 2024

Chess లో చిచ్చర పిడుగు.. మూడేళ్లకే ఫిడే రేటింగ్‌

కోల్‌కతాకు చెందిన మూడేళ్ల అనీష్‌ సర్కార్‌ చదరంగంలో సంచలనం సృష్టించాడు. మోస్ట్‌ యంగెస్ట్‌ ఫిడే రేటెడ్‌ ప్లేయర్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్ర అండర్‌-9 ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పాల్గొన్న చిచ్చర పిడుగు అనీష్‌ సర్కార్‌ 8 పాయింట్లకు 5.5 సాధించాడు.

దీంతో అనీశ్‌కు 1555 ఫిడే రేటింగ్‌ పాయింట్స్‌ లభించాయి. దీంతో 3 సంవత్సరాలు, 8 నెలలు, 19 రోజుల వయసు ఉన్న అనీష్‌ అతి చిన్న వయసులో ఫిడే రేటింగ్స్‌ సాధించిన ప్రపంచ యంగెస్ట్‌ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే తేజస్‌ (ఐదేళ్లు) రికార్డును తాజాగా అనీష్‌ బద్దలు కొట్టాడు. కాగా, అనీష్‌ సర్కార్‌ 2021 జనవరి 26న జన్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement