Tuesday, December 3, 2024

భారతజట్టు తమ సత్తా నిరూపించుకోవాలి..

భారత క్రికెట్‌ జట్టు ఓటమి సవాళ్లను ఎదుర్కొని తిరిగి పుంజుకోగలదని గత రెండేళ్లుగా నిరూపిస్తోంది. ఆస్ట్రేలియా కోట గబ్బాలో టెస్టు గెలుచుకుని ఆపై సిరీస్‌ను కైవసం చేసుకోవడం చిరస్మరణీయం. ఆ పోరాటాన్ని క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేరు. ఆ తర్వాత కొన్ని వారాల వ్యవధిలో ఇంగ్లండ్‌ చేతిలో చెన్నైవేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూసి ఆ తర్వాత పుంజుకుని ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో కూడా ఇదే జరిగింది. ఈనేపథ్యంలో కేప్‌టౌన్‌లో అందమైన న్యూలాండ్స్‌ మైదానంలో భారత్‌ మూడో చివరి టెస్టు నేటినుంచి ఆడనుంది. ఈ టెస్టుపై టీమిండియా ఆశాజనకంగా ఉండటానికి కారణం ఉంది. యాభై ఏళ్ల క్రితం వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌లలో వరుస సిరీస్‌లను గెలుచుకోవడం ద్వారా భారత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తాజాగా భారతజట్టు సఫారీగడ్డపై సిరీస్‌ గెలిచేందుకు చివరి అడ్డంకిని అధిగమించాలని ఆశిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి : ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా కివీస్‌ స్పిన్నర్‌..

ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే ఎవరికి ఆశ్చర్యం కలగదు. న్యూలాండ్‌లోని టెస్టు మ్యాచ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పుట్టినరోజున ప్రారంభం అవుతుంది. ఈ టెస్టును గెలుచుకుని ద్రవిడ్‌కు అత్యుత్తమ బహుమతి అందించాలని టీమిండియా భావిస్తోంది. రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకుంది. వాండరర్స్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్‌ బ్యాటింగ్‌ గురించి లోతుగా ఆలోచించాలి. సఫారీజట్టు కెప్టెన్‌ ఎల్గర్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. ప్రొటీస్‌ స్కిప్పర్‌ తన పోరాటపటిమతో జట్టులో విజయకాంక్షను నింపాడు. కాగితంపై చూస్తూ భారతజట్టు అన్నివిధాలుగా మెరుగైన జట్టు అనడంలో సందేహం లేదు. ఇక టీమిండియా క్రికెటర్లు మైదానంలో తమనుతాము నిరూపించుకుని అంతిమ యుద్ధంలో గెలవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement