Friday, March 29, 2024

ఫిఫా ప్రపంచ కప్పు లక్ష్యంగా.. ఖతార్‌ వర్సెస్‌ ఈక్వెడార్‌ మధ్య తొలి మ్యాచ్‌

ఫుట్‌బాల్‌ సాకర్‌ సమరానికి ఖతార్‌ సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్పు లక్ష్యంగా వివిధ దేశాలకు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు సిద్దమయ్యారు. ఆతిథ్య ఖతార్‌ , ఈక్వెడార్‌ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం ఒక్కటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఏకంగా 4,000 పౌండ్ల (1800) కిలోల మాంసం తీసుకువచ్చాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ ఫుట్‌బాల్‌ జట్లు తమ హోం ఫుడ్‌ రుచిని కోల్పోకుండా ఉండడానికి ఇంత పెద్ద మొత్తంలో మాంసాన్ని తీసుకువచ్చాయి.

రొనాల్డో
పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన ఆటగాడు. అతని కాలికి బంతి దొరికిందంటే ప్రత్యర్థి ఆటగాళ్లు భయ పడాల్సిందే. ప్రపంచకప్‌ సాధించాలన్న కల ఇంతవరకు నెరవేరకపోవడంతో ఇటీవల ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రపంచకప్‌ పోర్చుగల్‌ సాధిస్తే తాను ఫుట్‌బాల్‌ క్రీడనుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటానని అన్నారు. 37 ఏళ్ల రొనాల్డో ఈ సారి అయిన ప్రపంచకప్‌ను ముద్దాడతాడా అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఉరుగ్వే జట్టు అనుమానమే
ఉరుగ్వే సౌత్‌ అమెరికా జట్టు. ఉరుగ్వే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. మరో సారి కప్పు లక్ష్యంగా జట్టు యత్నిస్తుంది. ఆటగాళ్లు మారినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించడం లేదు.

దక్షిణ కొరియా
వరుసగా పదో సారి ప్రపంచకప్పు కోసం పోరాడి ఓడిం ది దక్షిణ కొరియా జట్టు. ఈ సారి ప్రపంచకప్‌
సాధి ంచడం అంత సులభమైన విషయం కాదు ఉరుగ్వేను ఓడిస్తే కాని దక్షిణ కొరియా ముందంజ వేసే అవకాశం ఉంది.

ఘనాకు
అర్హత రౌండ్లో చెప్పుకోతగ్గ ప్రదర్శనతో ప్రపంచకప్‌ ఆడే చాన్స్‌ కొట్టేసిన ఘనాకు మెగా టోర్నీలో సవాలు ఎదురు కానుంది. ఈ తక్కువ ర్యాంకు జట్టు గ్రూప్‌లో ఒక్క విజయమైనా సాధిస్తుందేమో చూడాలి.

నెయ్‌మార్‌
ఈ బ్రెజిల్‌ ఆటగాడు ప్రపంచకప్పు కోసం అనేక సార్లు పోరాడాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌పై తన ముద్రను పదిలపర్చుకున్నాడు. టైటిల్‌ ఫేవరేట్‌గా ఆయన మరోసారి రంగంలో దిగాడు.
ఫుట్‌ బాల్‌ అనగానే వినిపించే దేశం పేరు బ్రెజిల్‌. ప్రపంచవ్యాప్తంగా తమ జాతీయ జట్టుతో సంబంధం లేకుండా బ్రెజిల్‌ను అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉంటారనడంలో అతి శయోక్తి లేదు.. ఆటకు పర్యాయ పదంగా నిలిచిన బ్రెజిల్‌ ఐదుసార్లు విశ్వ విజేతగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పీలే కాలం నుంచి రొనాల్డో వరకు ఎందరో బ్రెజిల్‌ స్టార్లు ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేశారు.

స్విట్జర్లాండ్‌
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ (1934, 1938,1954) ఫిఫా ర్యాంకు: 15
అర్హత ఎలా: క్వాలి ఫయింగ్‌లో టోర్నీలో తమ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. 15 గోల్స్‌ చేసి 2 మాత్రమే ఇచ్చి అనూహ్యంగా అగ్ర స్థానంలో నిలిచింది. కొత్త కోచ్‌ మురాత్‌ యకీన్‌ పర్యవేక్షణలో డిఫెన్స్‌లో బలంగా మారింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమిష్టితత్వంతో మ్యాచ్‌లు నెగ్గడమే స్విస్‌ జట్టు ప్రధాన బలం. బ్రెజిల్‌ను వదిలేస్తే సెర్బియాతో పోటీ ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్‌తోనే ముందంజ వేయడం తేలుతుంది.

సెర్బియా

ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం ఫిఫా ర్యాంకు : 21 , అర్హత ఎలా: క్వాలి ఫయింగ్‌ టోర్నీలో పోర్చుగల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంతో అర్హత సాదించడం విశేషం. అటాకింగ్‌ ప్రధాన బలం కాగా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. కోచ్‌ స్టొకోవిచ్‌ జట్టులో కొత్త స్పూర్తిని నింపాడు. దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్‌ డ్యుసాన్‌ టాడిక్‌ ప్రదర్శన కీలకం కానుంది. పావ్లొవిక్‌, ల్యూకిక్‌ ఇతర ప్రధాన ఆటగాళ్లు. అయితే గ్రూప్‌లో పోటీని బట్టి చూస్తే నాకౌట్‌ చేరడం అద్భుతమే అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement