Wednesday, April 24, 2024

కోచ్‌ అంటే ఇట్లుండాలే.. డకౌట్‌ అయిన కోహ్లీని ఓదార్చిన సంజయ్​ బంగర్‌

ఐపీఎల్‌-2022లో విరాట్‌ కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. అభిమానులను నిరాశపరిచాడు. రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించాడు కానీ, మిగిలిన మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మూడోసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో అతడు విసుగు, కోపం కలగలిసిన చిరునవ్వుతో క్రీజును వీడుతూ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. అప్పుడు అతడ్ని ఓదార్చేందుకు ఆర్సీబీ హెడ్‌ ఖోచ్‌ సంజయ్‌ బంగర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్ళాడు. తల నిమురుతూ, మరేం పర్లేదన్నట్టుగా ఊరట కలిగించాడు. ఇలాంటివన్ని సహజమేనని అతనిలో ఉత్సా#హం నింపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు.. ”కోచ్‌ అంటే ఇలా ఉండాలి.. కోహ్లీ పట్ల సంజయ్‌ వ్యవహరించిన తీరుకు హ్యాట్సాఫ్‌” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement