Wednesday, March 22, 2023

శార‌దా పీఠాన్ని స‌తీస‌మేతంగా సంద‌ర్శించిన కేఎస్ భ‌ర‌త్

స‌తీస‌మేతంగా విశాఖ శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు టీమిండియా టెస్టు టీమ్ వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్ . రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు. ఐపీఎల్‌‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్‌ వెళ్తున్నట్లు భరత్‌ స్వామీజీకి తెలియజేశారు.

- Advertisement -
   

అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించానని చెప్పారు. కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడారు.
మరోవైపు విశాఖలో ఈ నెల 19న జరగనున్న భారత్‌, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌కు విజయనగరం జిల్లాచకు చెందిన తోట విజయ్‌ను స్కోరర్‌గా నియమించినట్లు ఆంధ్రా క్రికెట్‌ సంఘం ప్రకటించింది. ఇప్పటికి నాలుగు టీ-20లు, తొమ్మిది వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు, 13 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు విజయ్ స్కోరర్‌గా సేవలు అందించారు. అలాగే 350కి పైగా పోటీలకు అంపైర్‌గా విజయ్ వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement