Thursday, April 25, 2024

అందుకే రోహిత్‌ను కెప్టెన్ చేయాలి: లిటిల్ మాస్టర్

టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాన్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆ తరువాత జట్టు పగ్గాలు అందుకునే నాయకుడి గురించి ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ కాని రిషబ్ పంత్ గాని జట్టు పగ్గాలు అందుకుంటారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. భారత జట్టు సారధ్యంలో భారీ మార్పులకు ఇది సమయం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అందుకే రోహిత్ శర్మను తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సూచించాడు. ‘‘వరుసగా ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో కెప్టెన్సీలో భారీ మార్పులు మంచిది కాదు. అందుకే రోహిత్‌ను కెప్టెన్ చేయాలి’’ అని లిటిల్ మాస్టర్ చెప్పాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడం మంచిదని అభిప్రాయపడ్డాడు. అయితే రోహిత్, విరాట్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని వదంతులు ఉన్న నేపథ్యంలో గవాస్కర్ అభిప్రాయం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఊరట.. రాజస్థాన్ ఆశలపై నీళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement