Saturday, April 20, 2024

జింబాబ్వేతో మూడు వన్డేల మ్యాచ్‌.. హరారేకు బయలు దేరిన టీమిండియా

దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు సభ్యులు హరారేకు పయనమయ్యారు. కెప్టెన్‌ రాహుల్‌ నేతృత్వంలో భారత జట్టు ఆగస్టు 18న జింబాబ్వేతో తొలివన్డేకు తలపడనుంది. ఆగస్టు 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌ వంటి జట్టును ఓడించిన జింబాబ్వే మరోవైపు భారత్‌కు సవాల్‌ కూడా విసిరింది. జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్‌ హౌటన్‌ ఈ మేరకు దమ్ముంటే గెలిచి చూపించండి అని సవాల్‌ విసిరాడు.
అనుభవం సంపాదించడానికే..

” భారత క్రికెట్‌ అంటే అంతర్జాతీయ క్రేజ్‌ ఉంది. చాలా సంవత్సరాల నుంచి భారత్‌ శైలిని మేము గమనిస్తున్నాం. మూడు, నాలుగు జట్లను తయారుచేయగలిగే సామర్ధ్యం భారత్‌కు ఉంది.. మాతో తలపడటానికి వస్తున్న భారత్‌ జట్టు సభ్యులను ఆహ్వానిస్తున్నాం. మేం గట్టి పోటి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం సంపాదించడానికి వినియోగించుకుంటాం. మా జట్టు సభ్యులతో కూడా ఇదే విషయమై చర్చించుకున్నాం. ఆత్మావ లోకనం చేసుకున్నాం. భారత్‌ వంటి పెద్ద జట్టుతో తలపడడం ఒక అవకాశంగా మలచుకుంటున్నాం. మంచిస్కోర్లు సాధించడంతో పాటు అద్భుత విజయాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. భారత జట్టుకు సవాల్‌ విసిరేలా ఆడాలని మా జట్టు సభ్యులకు సూచించా. మా జట్టు సభ్యులు గట్టిగా పోరాడతారు అనే నమ్మకం ఉంది. మా జట్టుతో జాగ్రత” అని డేవ్‌ హౌటన్‌ సవాల్‌ విసిరాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదు టి -20 సిరీస్‌ , మూడు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా, సికిందర్‌ రజా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించారు.

న్డే సిరీస్‌ భారత్‌తో పాటు జింబాబ్వేకు చాలా కీలకం. 2023 ప్రపంచకప్‌కు నేరుగా వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో రాణించాలి. 13 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్‌లో టాప్‌ -8 టీమ్‌లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్తులను క్వాలిఫయ్యర్స్‌ మ్యాచుల్లో నెగ్గిన జట్లకు కేటాయిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement