Wednesday, April 24, 2024

Team India: వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..

న్యూఢిల్లి: టీమిండియా వన్డే పగ్గాలను ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు అప్పగించిన సెలక్షన్‌ కమిటీ త్వరలోనే కేఎల్‌ రాహుల్‌కు వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. కోహ్లీకి డిప్యూటీగా ఉన్న రోహిత్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ అందుకున్నాడు. దీంతో తదుపరి వైస్‌ కెప్టెన్‌ ఎవరనేది చర్చణీయంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే వన్డే జట్టును ప్రకటించినపుడే కేఎల్‌ రాహుల్‌ను కూడా వైస్‌ కెప్టెన్‌గా నియమించనున్నారు. భవిష్యత్తులో కేఎల్‌ రాహుల్‌ టీమిండియా కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో అతడికి ముందుగా వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌తోపాటు, కోహ్లీ, రోహిత్‌ నుంచి రాహుల్‌కు మద్దతు ఉంటుందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఇప్పటికే కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement