Thursday, October 10, 2024

WTC | టీమ్ ఇండియా మ‌రింత ముందుకు…

టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 74.24 విజయశాతంతో అగ్రస్థానంలో ఉంది.

రోహిత్‌ సేన 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. రెండింట్లో ఓటమి ఎదురైంది. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరోవైపు వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్‌.. 34.38 శాతంతో ఏడో స్థానానికి పడిపోయింది. 8 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టుకిది అయిదో ఓటమి. ర్యాంకింగ్స్‌లో భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement