Saturday, April 20, 2024

ఇండియన్ మహిళా హాకీ ప్లేయర్ కు టాటా మోటార్స్‌ బహుమతి..

టోక్యో ఒలింపిక్స్‌, ఇండియన్‌ హాకీ టోర్నమెంట్‌లో ప్రతిభకనబరచిన ఇండియన్‌ మహిళా గోల్‌ కీపర్‌ రజనీకి టాటా మోటార్స్‌ కారు బహుమతిగా అందజేసింది. తిరుపతి డీలర్‌ విజయభారతి ఆటోమొబైల్స్‌ యజమాని కారును బహుమతిగా అందజేశారు. నిన్న తిరుపతిలోని టాటా మోటార్స్‌ విజయభారతి ఆటోమొబైల్స్‌లో డీలర్‌ ఎస్‌ వెంకటరమణ ఆమెకు ఘన స్వాగతం పలికి టాటా ఆల్ట్రోస్‌ కారును అందజేశారు.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర మాట్లాడుతూ ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మన ఇండియన్‌ హాకీ మహిళా క్రీడాకారులు చూపిన ప్రతిభ అద్వితీయం అన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ హాకీ క్రీడల్లో పాల్గొని దేశానికి కీర్తి తేవాలని ఆయన ఆకాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement