Monday, March 27, 2023

Cricket: టీ20 వరల్డ్​ కప్​ సెకండ్​ సెమీస్‌.. టీమిండియా, ఇంగ్లండ్​ జట్ల మధ్య బిగ్​ ఫైట్​

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ గురువారం జరగనుంది. ఇంగ్లాండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌ కఠినంగానే ఉంటుంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో నువ్వా నేనా అన్నట్లు బరిలో దిగనుంది. బలమైన ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టి ఫైనల్‌కు రావడం అంత సులభమేమి కాదు. సూపర్‌ 12లో అద్భుత ప్రతిభ కనబరిచిన టీమిండియా జట్టు ఫైనల్‌ బెర్తు కోసం బ్రిటీష్‌ జట్టుతో తలపడనుంది. నాకౌట్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని భారత బ్యాటింగ్‌ విభాగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మరో వైపు లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన ఇంగ్లాండ్‌ సెమీస్‌లో స్థాయికి తగ్గట్టు రాణించాలని భావిస్తోంది.

- Advertisement -
   

టి 20 ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లల మధ్య ఆడిలైడ్‌ వేదికగా జరగనుంది. సూపర్‌ 12లో దక్షిణాఫ్రికా మినహా మిగతా నాలుగు జట్లపై మెరుగైన ఆటతీరు కనబర్చిన రోహిత్‌ సేన నాకౌట్‌ దశలో ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్‌పై ఇప్పటి వరకు మెరుగైన ఆటతీరు కనబర్చడం, భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

అయితే 2013 తర్వాత నుంచి ఐసీసీ టోర్నీల్లో లీగ్‌ దశను సునాయాసంగా అధిగమిస్తున్న భారత్‌ జట్టు నాకౌట్‌ దశలో మాత్రం తడబడుతూ వస్తోంది. 2014 టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌, 2016లో సెమీ ఫైనల్‌ , 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ , 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో ఓటమి చవి చూసింది. ఈ సారి ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలని రోహిత్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ , కెఎల్‌రాహుల్‌ స్థాయికి తగ్గట్టుగా రాణించాలని జట్టు భావిస్తోంది.
గత రెండు మ్యాచులలో రాహుల్‌ అర్థ శతకాలు చేయడం జ ట్టుకు ఊరట కలిగిస్తోంది. రోహిత్‌ కూడా తన మునుపటి ఫాం అందుకుంటే భారీస్కోర్‌ ఖాయమని యోచిస్తోంది.

విరాట్‌ , సూర్యకుమార్‌ అద్భుతంగా రాణిస్తుండగా వికెట్‌ కీపర్లుగా ఉన్న దినేష్‌ కార్తిక్‌ , రిషబ్‌ పంత్‌ ఈ టోర్నీల్లో పెద్దగా రాణించలేదు. వీరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్‌ జట్టును దృష్టిలో పెట్టుకుని వీలైనంత ఎక్కువ మంది బ్యాటర్లు ఉండాలనే అంచనాతో వీరిద్దరిని తుది జట్టులో తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. లెప్ట్‌ ఆమ్‌ బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సారథి రోహిత్‌ సంకేతాలు ఇచ్చినందున పంత్‌కు కూడా అవకాశం ఇస్థారని అర్థమవుతుంది.

పేస్‌ బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌, అర్షదీప్‌, మమమ్మద్‌ షమీతో పాటు హార్థిక్‌ పాండ్యా స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఇంగ్లీషు బ్యాటర్లను కట్టడి చేయవచ్చని భారత జట్టు భావిస్తోంది. స్పిన్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌ భారీగా పరుగులు ఇస్తుండగా యజువేంద్ర చాహల్‌ను తీసుకునే ధైర్యం చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆల్‌ రౌండర్‌ దీపక్‌ హుడా ప్రాక్టీసు చేస్తున్నందున ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో హుడాను తీసుకునే సూచనలున్నాయి. మరో వైపు ఇంగ్లండ్‌ జట్టు కూడా సెమీస్‌లో భారత్‌పై నెగ్గి టైటిల్‌కు చేరుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. జోస్‌ బట్టర్‌, బెన్‌ స్టోక్స్‌ , అలాక్స్‌ హెల్స్‌, లివింగ్‌ స్టోన్స్‌ వంటి బ్యాటర్లతో పాటు సామ్‌ కరన్‌, మెయిన్‌ అలీ వంటి ఆల్‌ రౌండర్లతో ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ బలీయం ఉంది.

అయితే ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ గాయం కారణంగా దూరం కావడం ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కీలక బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ కూడా గాయపడగా తుది జట్టులో ఆడే అంశంపై సందిగ్దం నెలకొంది. మార్క్‌ వుడ్‌ స్థానంలో జోర్దాన్‌ లేదా మిల్స్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌. భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌ జట్టు ఫైనల్‌ చేరినందున భారత్‌ కూడా తుదిపోరుకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

దేశమంతా భారత్‌ విజయం సాధించాలని కోరుకుంటోంది అని హర్బజన్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌ పరంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాడిన పడితే టీమిండియా టాప్‌ ఆర్డర్‌కు తిరుగు ఉండదు. రాహుల్‌ , కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ దంచేస్తున్నారు. అయితే లోయర్‌ ఆర్డర్‌లో రిషబ్‌ పంత్‌ / దినేష్‌ కార్తిక్‌ , హార్థిక్‌ పాండ్యా బ్యాట్‌ను ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement