టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవ్వాల రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ స్టేడియంలో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొంది 1.0 ఆధిక్యంలో ఉంది. ఇవ్వాల టీమిండియా గెలుపొందాలని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక.. తదుపరి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
- Advertisement -
దీనికి సంబంధించిన టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఒకదశలో నిన్న టిక్కెట్ల కొనుగోల కోసం జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట జరిగింది. గేట్లను తోసుకుని వచ్చిన క్రికెట్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది.