Thursday, April 18, 2024

భజ్జీ కాళ్లు మొక్కిన రైనా..

చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య నున్న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎస్ కే ఆటగాడు‌ సురేశ్‌ రైనా, కేకేఆర్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ పాదాలకు నమస్కరించాడు. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న భజ్జీ.. వెంటనే రైనాను వారించి, హత్తుకుని ఆప్యాయత చాటుకున్నాడు. అందుకే కదా మాకు రైనా అంటే ఇష్టం. తన మాజీ సహచర ఆటగాడి పట్ల అతడికి ఉన్న గౌరవమర్యాదలు ఇలా తెలియజేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా హర్భజన్‌ సింగ్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

https://twitter.com/sportzhustle/status/1384868204816723976?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement