Saturday, April 20, 2024

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ – సునీల్ న‌రైన్ ఔట్ – 73/6

ఐ పీఎల్ 202 3సీజన్‌లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోంటున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.. బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది.. హిట్ట‌ర్ రింకూ సింగ్ కెప్టెన్ నితీష్ రానాతో స‌హా ప్ర‌ధానమైన 6 వికెట్ల‌ను కోల్పోయింది.. 2 ప‌రుగులు చేసిన సునీల్ న‌రైన్ ను అక్ష‌ర ప‌టేల్ ఔట్ చేశాడు. రింకూ సింగ్ 6 ప‌రుగులు చేసి అక్ష‌ర ప‌టేట్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. అంత‌కు ముందు 12 ప‌రుగులు చేసిన మ‌న్ దీప్ సింగ్ ను అక్ష‌ర ప‌టేల్ నాలుగో వికెట్ గా ప‌డ‌గొట్టాడు.. నాలుగు ప‌రుగులు చేసిన రానా మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. ఈ వికెట్ ఇషాంత్ శ‌ర్మ‌కు ల‌భించింది.. కాగా, తొలి వికెట్ గా లింట‌న్ దాస్, రెండో వికెట్ గా వెంక‌టేష్ అయ్య‌ర్ లు వెంట‌వెంట‌నే అవుల‌య్యారు.. లింట‌న్ 4 ప‌రుగులు చేయ‌గా, అయ్య‌ర్ డ‌కౌట్ గా వెనుతిరిగాడు .. లింట‌న్ వికెట్ ముఖేష్ కుమార్, అయ్యార్ వికెట్ నోకియాకు ల‌భించాయి.. ప్ర‌స్తుతం 12 ఓవ‌ర్లో 6 వికెట్ల న‌ష్టానికి 73 ప‌రుగులు చేసింది.
కాగా, ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement