Thursday, April 18, 2024

ముంబై vs సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. అప్పుడే ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్.. తనకంటే ఎన్నో రెట్లు బలమైన ముంబై ఇండియన్స్‌ను ఇవా౪ ఢీ కొట్టబోతోంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతుంది. సన్ రైజర్స్ కంటే.. ముంబై ఇండియన్స్ చాలా బలంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచూ గెలవలేదు. ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేకపోవడం వల్ల పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడుతున్న అన్ని జట్లూ రెండేసి చొప్పున మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఈ దశలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాన్ని సాధించింది కోహ్లీసేన. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ టాప్‌ఫైవ్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement