Friday, April 19, 2024

Under–19 (W) World Cup | ఇంగ్లండ్​ను చిత్తుచేసిన షఫాలీ సేన.. ​అండర్​19 వరల్డ్​ కప్​ మనదే !

ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్​ 19 విమెన్స్​ వరల్డ్​ కప్​లో టీమిండియా అమ్మాయిలు దుమ్మురేపారు. సెమీస్​లో న్యూజిలాండ్​ జట్టును మట్టికరిపించి.. ఇవ్వాల ఫైనల్​లో ఆడారు. కాగా, ఇంగ్లండ్​తో జరిగిన ఫైనల్​ పోరులో అమ్మాయిల జట్టు అదుర్స్​ అనిపించింది. కెప్టెన్​ షఫాలీ సేన బౌలింగ్​, బ్యాటింగ్​ విభాగంలో పటిష్టంగా నిలిచి వరల్డ్​ కప్​ని సొంతం చేసుకుంది.

తొలుత టాస్​ గెలిచిన టీమిండియా అమ్మాయిల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 17 ఓవర్లలోనే ఇంగ్లండ్​ ఆట కట్టించారు బౌలర్లు. కాగా, టీమిండియా బౌలర్ల దాటికి తట్టుకోలేక ఇంగ్లండ్​ జట్టు 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. 69 పరుగుల టార్గెట్​తో బ్యాటింగ్​కి దిగిన షఫాలి వర్మ టీమ్​.. దీటుగా ఆడింది. ఈ క్రమంలో కెప్టెన్​ షఫాలీ (15), శ్వేత (5) పరుగులకు అవుటయ్యారు. ఇక ఆతర్వాత బ్యాటింగ్​కు వచ్చిన సౌమ్యా తివారి 24*, గొంగడి త్రిష (24) పరుగులతో మాంచి ఆటతీరు కనబరిచారు. మరో వికెట్​ కోల్పోకుండా స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే క్రమంలో త్రిష 24 పరుగుల వద్ద అవుటయ్యింది. సౌమ్యకి తోడుగా హ్రిషితా బసు 0* క్రీజులోకి చవ్చింది. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా అమ్మాయిల అండర్​ 19 జట్టు వరల్డ్​​ కప్​ని సొంతం చేసుకుంది.

క్రికెటర్​ గొంగడి త్రిష.. ఖమ్మం జిల్లా

కాగా, ఈ జట్టులో అత్యంత ప్రభావవంతమైన ఆటతీరు కనబరిచిన గొంగడి త్రిష తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి కావడం గర్వకారణమని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్.. ఇతర ప్రముఖులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement