Thursday, April 25, 2024

ఇంటిదారి పట్టిన ఖతార్‌.. 1-3తేడాతో సెనెగల్‌ విజయం

గ్రూప్‌ ఎలో భాగంగా శుక్రవారం సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖతర్‌ 1-3 తేడాతో ఓటమి చవి చూసింది. ఫిఫా వరల్డ్‌ కప్‌కు ఆథిథ్యం ఇచ్చిన ఖతార్‌ దేశంలో వరుసగా రెండో పరాజయం ఎదుర్కొన్న ఖతార్‌ జట్టు ఇక ఇంటి దారి పట్టినట్టే. సెనెగల్‌ ప్రపంచకప్‌ ఖాతా తెరవడంలో రౌండ్‌ ఆఫ్‌ 16 ఆశలు సజీవమయ్యాయి.

తొలి అర్ధ భాగంలో సెనెగల్‌ తరపున బులాయో తొలిగోల్‌ అందించాడు. వెంటనే ఫర్మారా సెనెగల్‌ తరపునరెండో గోల్‌ అందించాడు. తొలి అర్థ భాగంలో 2-0 స్కోరు నమోదు చేసిన సెనెగల్‌ 84 వ నిమిషంలో సెనెగల్‌ నుంచి చెక్‌ డింగ్‌ మరో గోల్‌ కొట్టడంతో 3-0 స్కోరు సెనెగల్‌కి దక్కింది. అయితే తొలి అర్థభాగంలో ఒక్క గోల్‌ చేయని ఖతార్‌ రెండో అర్థ భాగంలో 78వ నిమిషంలో ఒక గోల్‌ చేసింది. మరో గోల్‌ చేయడానికి ఖతర్‌ విఫలయత్నం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement