Monday, March 25, 2024

చేతన్‌ సకారియా సూపర్: వీరేంద్ర సెహ్వాగ్

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ చేతన్‌ సకారియాపై వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఏమత్రం బెరుకు లేకుండా ఆడాడని, ఒక మంచి బౌలర్‌కు కావాల్సిన లక్షణాలు తనలో మెండుగా ఉన్నాయని కితాబిచ్చాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా రాణిస్తాడని ఊహించలేదన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తన ఆటను కూడా చూశాను. కానీ ఇంతబాగా బౌల్‌ చేస్తాడని అస్సలు ఊహించలేదు.

దేశవాళీ క్రికెట్‌లో వివిధ రకాల బ్యాట్స్‌మెన్‌ను తను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే, ఐపీఎల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. స్టార్‌ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా పంచుకున్న అభిప్రాయాల ప్రకారం, తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎక్కడ బౌండరీ బాదుతాడేమోనని అస్సలు భయపడకూడదు. అవకాశం దొరికేంతవరకు ఓపికగా వేచి చూసి, గట్టిగా దెబ్బకొట్టాలి. అప్పుడే వికెట్లు ఎలా తీయాలన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. సకారియాలో ఇలాంటి లక్షణాలను నేను చూశాను. ఎంతో పట్టుదలగా ఆడాడు’’ అని ప్రశంసించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement