Thursday, April 18, 2024

ఇక పోటీ ప‌డ‌లేక‌పోవ‌డం పెద్ద లోటే – సానియామీర్జా

దుబాయ్‌: మహిళల డబుల్స్‌ టైలో అమెరికా భాగస్వామి మాడిసన్‌ కీస్‌తో కలిసి సానియా మిర్జా వరుస సెట్లలో ఓడిపోయింది. రెండు దశాబ్దాల సు దీర్ఘ కెరీర్‌కు తెరదించుతూ రిటైర్మెంట్‌ ప్రకటించిన సానియా మిర్జా తన ఆఖరి టోర్నీలో ఓడిపోయిం ది. దుబాయ్‌ డ్యూటీ ప్రీ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ లో తొలి రౌండ్‌లో ఓటమితో తన 20 ఏళ్ల అద్భుత కెరీర్‌ను ముగించింది. తర్వాత ఆమెను మనం మళ్లిd కోర్టులో చూడలేం. ఈ నేపథ్యంలో సానియా స్పందించింది. ఇకపై పోటీ పడకలేకపోవడం పెద్ద లోటేనని వ్యాఖ్యానించింది. ఆటకు దూరమైతే మీకు ఏ విషయంలో వెలితిగా అనిపిస్తుందన్న ప్రశ్నకు సానియా స్పందిస్తూ ”పోటీ పడడం వల్ల గెలవడం వల్ల పోరాడడం వల్ల వల్ల కలిగే అనుభూ తిని నేను కోల్పోతా. పెద్ద కోర్టుల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య అడుగుతున్నప్పుడు కలిగే భావన వేరు. అది ఇక ఉండదు. అన్నింటి కంటే ముఖ్యంగా పోటీకి దూరమవుతా. అది పెద్ద వెలితే. రిటైర్మెంట్‌ తర్వాత నేనేం చేసినా పోటీ పడడం వల్ల కలిగే అను భూతిని నేను కోల్పోతా. పెద్ద కోర్టుల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య అడుగు పెడుతున్నప్పుడు కలిగే భావన వేరు. అది ఇక ఉండదు. అన్నింటి కంటే ముఖ్యంగా పోటీకి దూరమవుతా. అది పెద్ద వెలితే. రిటైర్మెంట్‌ తర్వాత నేనేం చేసినా పోటీ పడడం వల్ల కలిగే అనుభూతి దేనివల్ల కలగదు” అని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement