Saturday, April 20, 2024

క్రీడలకు రూ.3,062కోట్లు కేటాయింపు..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,062.60కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలీస్తే రూ.305.58కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. ఖేలో ఇండియాకు గతేడాది రూ.657.71కోట్లు కేటాయిస్తే ఆ మొత్తాన్ని రూ.974కోట్లుకు పెంచారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకర నగదు గతంలో రూ.245కోట్లు ఉండగా తాజా బడ్జెట్‌లో రూ.357కోట్లుకు పెంచారు. గత ఐదుసంవత్సరాల బడ్జెట్‌ కంటే ఈ ఏడాది కేటాయించిన మొత్తం అధికం. 2017-18లో రూ.1943కోట్లు, 2018-19లో రూ.2197కోట్లు, 2019-20లో రూ.2776కోట్లు, 2020-21లో రూ.2826కోట్లు, 2021-22లో 2596కోట్లు ఉండగా, ఈ సంవత్సరం క్రీడా బడ్జెట్‌ రూ.3062.60కోట్లుకు పెంచారు.

క్రీడల అభివృద్ధిలో భాగంగా క్రీడాకారులకు జాతీయక్యాంపులు, శిక్షణ, మౌలిక వసతుల కల్పన, శిక్షణ కార్యాలయాల్లో వసతులు, అధునాతన క్రీడా సామగ్రి ఏర్పాటు తదితర అవసరాల కోసం కేంద్ర క్రీడాశాఖ ఈ మొత్తాన్ని ఖర్చుచేయనున్నది. ఈ ఏడాది ఆసియాగేమ్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి. అదేవిధంగా 2024లో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement